పోతారం గ్రామానికి స్వాగతం

తెలంగాణ రాష్ట్రం , జగిత్యాల జిల్లా, కథలాపూర్ మండలం లోని 18 గ్రామాల్లో ఈ పోతారం ఒక గ్రామం, ఈ మండలం లోని మారుమూల ప్రాంతాల్లో ఈ పోతారం గ్రామం ఒకటి . పోతారం గ్రామ జనాభా సుమారు 2000 ( రెండువేలు ), పోతారం గ్రామానికి చుట్టూ మూడు వైపులా పచ్చని కొండలు , ఒక వైపు పచ్చని పొలాలు కనిపిస్తూ చాల ఆనందాన్ని , మనసుకి ఆహ్లాదాన్ని , సంతోషాన్ని కలిగిస్తాయి

పోతారం గ్రామం లో ఎన్నో రకాల కుల మతాల వాళ్ళు జీవిస్తున్నారు . ఉదా : పద్మశాలి ( నేత ), కాపు (రెడ్డి ), తెనుగు (ముదిరాజ్ ), కమ్మరి -వడ్రంగి (విశ్వబ్రాహ్మణ ), చాకలి (రజక ), కుమ్మరి , గొల్ల (యాదవ ), గౌడ (గీత ), మంగళి (నాయిబ్రహ్మన ), మాల , మాదిగ , లంబాడి( బంజారా ) , ఒడ్డెర, దూదేకుల కులానికి చెందినవారు ఉన్నారు. ఈ ఊరికి దక్షిణ దిశలో రెండు కొండల నడుమ వెలసిన ఈ ఊరి దేవుడు శ్రీ లొంక రామేశ్వరుడు . అతడే ఈ ఊరి ప్రజలందరికి ఇలవెలుపు.

ఎలాంటి కల్మషం లేని ప్రజలు వారి మనసులు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు వాకిట్లో కలాపి చల్లి అందులో ముగ్గులు వేసే ఆడపడుచులు , గ్రామం లో ఉన్న కుల మతాలా వాళ్ళు కలిసిమెలిసి ఉండటం చూస్తూ ఉంటె మన తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలు గుర్తుకు వస్తాయి

ఇంక చదవండి


ప్రకటనలు

Rajahamsha Fashions - Metpally
Saraswathi Band - Rudrangi, Potharam
Rasa Rajalingam Tent House - Potharam
Gorla Ramakrisha - Potharam
రూపకల్పన మరియు అభివృద్ధి మహేష్ శ్రీరాముల, నాగాధర్ బండి , సాగర్ రడం, మిత్రబృందం.
© 2018 పోతారం అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది.
Design and Developing by Wedodesigning, Hosted By InnovServers
web counter