పోతారం గ్రామం గురించి

తెలంగాణ రాష్ట్రం , జగిత్యాల జిల్లా, కథలాపూర్ మండలం లోని 18 గ్రామాల్లో ఈ పోతారం ఒక గ్రామం, ఈ మండలం లోని మారుమూల ప్రాంతాల్లో ఈ పోతారం గ్రామం ఒకటి . పోతారం గ్రామ జనాభా సుమారు 2000 ( రెండువేలు ), పోతారం గ్రామానికి చుట్టూ మూడు వైపులా పచ్చని కొండలు , ఒక వైపు పచ్చని పొలాలు కనిపిస్తూ చాల ఆనందాన్ని , మనసుకి ఆహ్లాదాన్ని , సంతోషాన్ని కలిగిస్తాయి

పోతారం గ్రామం లో ఎన్నో రకాల కుల మతాల వాళ్ళు జీవిస్తున్నారు . ఉదా : పద్మశాలి ( నేత ), కాపు (రెడ్డి ), తెనుగు (ముదిరాజ్ ), కమ్మరి -వడ్రంగి (విశ్వబ్రాహ్మణ ), చాకలి (రజక ), కుమ్మరి , గొల్ల (యాదవ ), గౌడ (గీత ), మంగళి (నాయిబ్రహ్మన ), మాల , మాదిగ , లంబాడి ( బంజారా ) , ఒడ్డెర , దూదేకుల కులానికి చెందినవారు ఉన్నారు. ఈ ఊరికి దక్షిణ దిశలో రెండు కొండల నడుమ వెలసిన ఈ ఊరి దేవుడు శ్రీ లొంక రామేశ్వరుడు . అతడే ఈ ఊరి ప్రజలందరికి ఇలవెలుపు.

ఎలాంటి కల్మషం లేని ప్రజలు వారి మనసులు ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు వాకిట్లో కలాపి చల్లి అందులో ముగ్గులు వేసే ఆడపడుచులు , గ్రామం లో ఉన్న కుల మతాలా వాళ్ళు కలిసిమెలిసి ఉండటం చూస్తూ ఉంటె మన తెలంగాణ సంస్కృతి , సాంప్రదాయాలు గుర్తుకు వస్తాయి

పోతారం గ్రామం ఏర్పడి ఇప్పటికి సుమారు 80 సం॥ గడుస్తుంది . ఈ 80 సం॥ క్రితం పోతారం గ్రామం "బట్టు " వారి వంశస్తుల పాలనలో ఉండేది . పోతారం గ్రామాన్ని పాలించిన ఈ "బట్టు " వంశస్తులు వారి దగ్గర పని చేసే కూలి వాళ్లకు ( గ్రామానికి చెందినా వారు ) పోతారం గ్రామ పొలిమేరల్లో కొంత భూమిని ఇచ్చినారు . తర్వాత కాలంలో ఇతర గ్రామాల నుండి వలస వచ్చిన వారిని గ్రామం లో ఉండమని , వాళ్ళకి కొంత భూమిని ఇచ్చి చేరదీశారు . మొదటి నుండి ఈ గ్రామం లో ఉన్నవారు, మరియు వలస వచ్చిన వారితో ఈ గ్రామం కాస్త పెద్దగా రూపుదిద్దుకుంది .

ఈలాంటి పోతారం గ్రామనికి ఉన్న ఒకే ఒక శాపం ఈ ప్రజలు తాగే మంచినీరు . ఈ గ్రామంలో లభించే నీటిలో నూటికి దాదాపు 80% ఫ్లోరైడ్ ఉంటుంది . 80 సం॥ ముందు నుండి ఇప్పటి వరకు ఇక్కడి ప్రజకు ఈ నీటినే తాగుతున్నారు . దీనికి ప్రతిఫలంగా ఇక్కడి కొంతమంది పళ్ళపై ఏర్పడే పసుపు పచ్చని గారలు మరియు శారీరక , మానసిక లోపం తో ఎదుగుదల లేని వికలాంగులు ఎంతో మంది ఉన్నారు . గ్రామ ప్రజలు పడే భాదలు చూడలేక 2012 వ సంవత్సరం లో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటం జరిగింది .

పోతారం గ్రామం లో ప్రస్తుతం ఒక ప్రాథమిక పాటశాల , ఒక ఉన్నత పాటశాల మరియు రెండు అంగన్ వాడి కేంద్రాలు ఉన్నాయి . మరియు పోతారం గ్రామం చివరగల గిరిజన తండాలో ఒక ప్రాథమిక పాటశాల, మరియు ఒక అంగన్ వాడి కేంద్రం కూడా ఉంది .


పేరు : హోదా సంప్రదించండి
ధర్మపురి జలంధర్ : సర్పంచ్ 9440752542
సిరికొండ రమేష్ : 1వ వార్డ్ మెంబర్ 9704630413
బత్తుల చంద్రశేఖర్ : 2వ వార్డ్ మెంబర్ 9494989991
పాలేపు లత : 3వ వార్డ్ మెంబర్ (ఉప సర్పంచ్ ) 8500598106
ఉంబరవేణి కేత : 4వ వార్డ్ మెంబర్
పడకంటి జనార్ధన్ : 5వ వార్డ్ మెంబర్ 9494727231
సిరికొండ రమేష్ : 6వ వార్డ్ మెంబర్ 8008815282
అంబటి నారాయణ : 7వ వార్డ్ మెంబర్
రడం లలిత : 8వ వార్డ్ మెంబర్ 9494363746
గొర్ల రామకృష్ణ : 9వ వార్డ్ మెంబర్ 8500599204
హరి నాయక్ : 10వ వార్డ్ మెంబర్
  • శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడి శంకుస్థాపన, గుడి నిర్మాణ పనులు ప్రారంభం.
  • లొంకరామన్న తండా వద్ద మినీ వాటర్ ట్యాంక్ కొరకు భూమి పూజ.
  • గ్రామంలో నీటి ఎద్దడి వుండడంతో తాళ్లమండ ప్రాంతం లో ఉన్న బోరుబావిలో కొత్త మోటార్ బిగిచడం జరిగింది.
  • గ్రామంలోని మొదటి వార్డులో సిసి రోడ్డు నిర్మాణం.
  • దాతల సహాయంతో ప్రైమరీ స్కూల్, మరియు హై స్కూల్ కి పెయింటింగ్.
రూపకల్పన మరియు అభివృద్ధి మహేష్ శ్రీరాముల, నాగాధర్ బండి , సాగర్ రడం, మిత్రబృందం.
© 2018 పోతారం అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది.
Design and Developing by Wedodesigning, Hosted By InnovServers