పోతారం గ్రామ ప్రజలందరి దేవుడు, అందరి ఇలవేలుపు , పోతారం గ్రామాన్ని ఎల్లవేళలా కాపాడే దైవం "శ్రీ లొంక రామేశ్వర స్వామీ ". చుట్టూ పచ్చని కొండల నడుమ వెలసిన ఈ శ్రీ లొంక రామేశ్వర స్వామీని దాదాపు 80 సంవత్సరాల క్రితం బట్టు వంశస్తులు గుర్తించి అక్కడ వెలసిన శివలింగానికి ఆలయ నిర్మాణం చేసారు . ఇప్పుడు ఈ ప్రాంతానికి వచినవారు ఎవరైనా ముందు ఈ గుడి లోకి వెళ్లి వాచ్చిన తర్వాతే నూతనంగా నిర్మించిన ఆలయం లోకి వెళ్తారు.
పోతారం గ్రామంలో శివుడు ఏర్పడిన విధానం గురించి గ్రామ ప్రజలు , పెద్దలు ఈ విధంగా చెప్తారు.
"చాలా సంవత్సరాల క్రితం శ్రీరాముని భార్య సీతా దేవిని లంకాధిపతి అయిన రావణాసురుడు ఎత్తుకేల్లినపుడు శ్రీరాముడు సీతాదేవి కొరకు వెతుకుతూ ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి కాసేపు సేద తీరి ఒక రాతితో శివలింగాన్ని నిర్మించి అటు ఇటు మంచి నీటి కొరకు వేతికాడట . నీరు దొరికితే శివలింగానికి అభిషేకం చేసి తన ప్రయాణాన్ని కొనసాగించావచ్చు . కాని ఎక్కడా కూడా నీటి జాడ లేదు . అప్పుడు శ్రీరాముడు తన విల్లుని ఎక్కుపెట్టి ఒక బాణాన్ని కొండ వైపుగా వదిలాడు . అది వెళ్లి ఒక పెద్ద బండరాయి కింద భాగాన తగిలింది.
అప్పుడు శ్రీరాముడు కాలి నడకన అటువైపుగా వెళ్లి ఆ భాణం దిగిన ప్రదేశాన్ని చేరుకొని ఆ రాయి కింది నుండి భాణాన్ని తిసివేయగా అక్కడ ఏర్పడిన రంధ్రం గుండా నీరు రావడం ప్రారంభమైంది . ఆ ప్రదేశాన్ని ఇక్కడి ప్రజలు "కోరి చెలిమే" అంటారు . అక్కడ ఇప్పటి వరకు నీరు బయటకి వస్తూనే ఉంటుంది . ఆ తరవాత ఈ ప్రదేశం నుండి శివలింగం ఉన్న చోటుకి ఈ నీటిని తీసుకపోవడం ఎలా? అని అలోచించి అక్కడ ఉన్నటువంటి రాళ్ళ మద్య నుండి శివలింగం ఉన్న ప్రదేశానికి దారగా నీరు వచ్చేల చేశాడు .
అల ప్రవహించుకుంటూ వచ్చిన నీరు ఒక చోట చేరి పెద్ద గుంతగా మారింది . ఆ ప్రదేశమే ఇప్పుడు శివాలయం ముందు భాగంలో ఉన్న కోనేరు . ఈ కోనేరు నుండి నీటిని తీసుకవెల్లి శ్రీరాముడు అక్కడ ఉన్న శివలింగానికి అభిషేకం చేసి పూజలు చేసేవాడని,,రాముడు పూజించిన ఈశ్వరుడు కావున రామేశ్వరుడని అంటారు . ఇక ఈ ప్రాంతం రెండు కొండల నడుమ ఉన్నది . కొండల నడుమ ఉన్న ప్రాంతాన్ని లొంక అంటారు . అప్పటి నుండి ఈ ప్రాంతం శ్రీ లొంక రామేశ్వర స్వామీ క్షేత్రంగా పిలువబడుతుంది."
అప్పటి నుండి శ్రీ లొంక రామేశ్వరుడు పోతారం గ్రామ ప్రజలతో నిరంతరం పూజలు అందుకుంటున్నాడు . ప్రస్తుతం చుట్టూ పది గ్రామాల ప్రజలు కూడా వచ్చి శ్రీ లొంక రామేశ్వరుని దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ప్రతి సంవత్సరం "మహాశివరాత్రి " పర్వదినాన ప్రత్యేక పూజలతో , భజన కీర్తనలతో ఈ లొంక రామేశ్వర క్షేత్రం మారుమోగిపోతుంది.
అంతే కాకుండా మరొక విషయం ఏమిటంటే పోతారం గ్రామం నుండి కేవలం 30కి. మీ . దూరంలోనే దక్షిణ కాశిగా పేరుపొందిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామీ క్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి గా అవతరించిన పరమ శివుడు మహాశివరాత్రి రోజున అక్కడ ఉన్నటువంటి భక్తుల రద్దీని భరించలేక , వారు కోరుకొనే కోరికలను ఒక ప్రశాంత వాతావరణం లో వింటే బాగుంటుందని ఈ అరణ్య ప్రాంతానికి వచ్చి శ్రీ లొంక రామేశ్వర క్షేత్రం లో ఉంటాడని కూడా ఇక్కడి ప్రజలు చెపుతారు.
శ్రీ లొంకరామేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు |
||
అధ్యక్షులు | : | సిరికొండ రాజేంధర్ |
ఉపాధ్యక్షులు | : | బండ రాజం ఇంద్రాల శ్రీధర్ |
ప్రధాన కార్యదర్శి | : | యెలుమల పెద్ద నర్సయ్య |
కోశాధికారి | : | ముస్కెం గంగ లక్ష్మణ్ |
సలహాదారులు | : | పులి హరి ప్రసాద్ అలువాల నరేష్ |
సభ్యులు | : |
సల్లం జలంధర్ కుప్ప రాజలింగం గొల్లపెల్లి మల్లయ్య గొర్ల రామకృష్ణ బానోత్ రత్నా నాయక్ గుగులోత్ హరిలాల్ దేశవేని లచ్చయ్య మొగిలిదేవయ్య |